»Funds Released For Electricity In Subsidy Telangana Election Of New Speaker Gaddam Prasad Kumar
Telangana assembly session: విద్యుత్ సబ్సిడీకి నిధులు విడుదల..కొత్త స్పీకర్ ఎన్నిక
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శాశ్వత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా..కాంగ్రెస్ మంత్రులు పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
Funds released for electricity in subsidy telangana Election of new Speaker gaddam prasad kumar
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(telangana assembly session) భాగంగా స్పీకర్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసాద్‌కుమార్(gaddam prasad kumar)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు(డిసెంబర్ 14న) బాధ్యతలు స్వీకరించారు. ఆ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దగ్గరుండి మరి అతనిని స్పీకర్ కూర్చిలో కూర్చొబెట్టి పూలబొకె ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో స్పీకర్ కు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు.
Gaddam Prasad Kumar will be the Telangana Assembly Speaker.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(mallu bhatti vikramarka) కీలక ప్రకటనలు చేశారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణి సబ్సిడీ కోసం రూ.374 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు, సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం రూ.75 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు కూడా పత్రాలపై సంతకం చేశారు.