»Former Minister Narayana Krishnapriya Who Filed A Complaint Rayadurg Police Station Against Her Husband
Krishnapriya: మాజీ మంత్రి నారాయణ, భర్తపై కృష్ణప్రియ ఫిర్యాదు
మాజీ మంత్రి నారాయణ తన భర్త సుబ్రహ్మణ్యం బెదిరిస్తున్నారని పొంగూరు కృష్ణక్రియ హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు తన మానసిక స్థితి బాలేదని చెప్పిన దాంట్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యంపై పొంగూరు కృష్ణక్రియ(Krishnapriya) హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కంప్లైంట్ చేసింది. తనను వీరిద్దరూ వేధిస్తున్నారని వెల్లడించింది. అంతేకాదు తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తన మానసిక ఆరోగ్యం బాలేదని చెప్పిన తనభర్తతోపాటు తన భావ నారాయణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు తనను బెదిరిస్తున్నారని ఆమె వెల్లడించింది.
నారాయణపై (Ex Minister Narayana) ఆయన తమ్ముడి భార్య కృష్ణ ప్రియ ఇటివల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నారాయణ తనను వేధించాడని పేర్కొన్నారు. నారాయణ కబంధ హస్తల్లో చిక్కిన పిట్టను తాను అని బాధను వెళ్లగక్కారు. తన బావకు ఇద్దరు భార్యలు అని చెప్పారు. అయినప్పటికీ తనను వేధించేవాడని అన్నారు. తన పెళ్లి సంబంధం కుదిరినప్పటీ నుంచి మొన్నటి వరకు జరిగిన క్రమాన్ని ఆమె వివరించారు. అయితే దీనిపై స్పందించిన కృష్ణప్రియ భర్త ఆమెకు మానసిక స్థితి బాలేదని మీడియాకు వివరణ ఇచ్చారు. కానీ అందుకు కౌంటర్ గా కృష్ణప్రియ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.