AP: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో నకిలీ టీ పొడి తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు టన్ను నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ టీ పొడిని తయారు చేస్తున్న ఇద్దరు నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సి సేకరించిన టీ పొడి నమూనాలను ఆహార భద్రత అధికారులు పరిశీలిస్తున్నారు.