విద్యార్థుల ఆందోళనలతో యూపీలో యోగి ప్రభుత్వం దిగొచ్చింది. యూపీపీఎస్సీ పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలోనే యూపీపీఎస్సీ ఛైర్మన్ సంజయ్ శ్రీ నెత్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ప్రిలిమినరీ పరీక్ష 2024ని ఒకే రోజులో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.