NRML: లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామ రైతులు తమ వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ గురువారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరి కొనుగోలు చేస్తేనే సమగ్ర సర్వేకు సహకరిస్తామని అన్నారు.