SKLM: గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జన జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఐటిడిఏ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం పాఠశాల వద్ద వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పీవో పరిశీలించారు. మెలియాపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల్లో కార్యక్రమం జరుగుతుంది.