SKLM: బూర్జ మండలం టిడిఆర్ రాజుపేటకు చెందిన జనసేన ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ గురువారం విజయవాడలో రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిశారు. గత ప్రభుత్వ హయాంలో ఆమదాలవలస నియోజకవర్గంలో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఫోర్జరీ చేసి భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయని హోమ్ మినిస్టర్కు వివరించారు. పోలీసు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.