NLR: వరికుంటపాడు మండలంలోని గ్రామాల్లో ఇంటి వద్దకే వెళ్లి ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు అందిస్తున్నామని మండల వైద్య అధికారిని ఆయేషా పేర్కొన్నారు. ఆమె గురువారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా 64 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.