దక్షిణాఫ్రికాలో 4,000 మంది మైనర్లు ఓ గనిలోకి ప్రవేశించి అక్కడే ఉండిపోయారు. అయితే వారంతా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అక్కడి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. గని ద్వారాలు మూసేసి.. ఆహారం, నిత్యవసరాలు పంపేందుకు ససేమిరా అంటోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వారు బయటకు వస్తే అరెస్టు చేసేలా ‘క్లోజ్ ది హోల్’ ఆపరేషన్ చేపట్టనున్నట్లు సమాచారం.