AP: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సతీసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో కొల్లు రవీంద్రకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.