NLR: మర్రిపాడు మండలం, డీసీపల్లి పొగాకు బోర్డు సమీపంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బైక్ను ఢీకొన్న ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని టోల్ ప్లాజా అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ వెళ్లిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.