ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నేడు ఈ కేసుకు సంబంధించిన రెండో చార్జ్ షీట్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది. అందులో మొత్తం 17 మందిపై అభియోగాలను ఈడీ మోపింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను కూడా ఈడీ అందులో నమోదు చేసింది. అదేవిధంగా అభిషేక్ బోయిన్ పల్లి, అమిత్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, బినయ్ బాబులతోపాటు కావోగాలి రెస్టారెంట్, ట్రైడెంట్ లిమిటెడ్, పెరమండ్ రిసార్ట్, పాపులర్ స్పిరిట్, అవంతికా కాంట్రాక్టర్స్, కేఎస్ జయం స్పిరిట్, బడ్డీ రిటైల్స్, స్పిరిట్ డిస్ట్రిబ్యూషన్, ఆర్మో మిక్స్ ఎకో సిస్టమ్‌ల పేర్లను కూడా నమోదు చేసింది.
ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్‌ను ఢిల్లీ సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుని పరిశీలించింది. అయితే విచారణను ఫిబ్రవరి 23వ తేదికి వాయిదా వేస్తూ నిందితులకు నోటీసులను జారీ చేసింది. లిక్కర్ స్కామ్ లో మొదటిసారి సీఎం పేరు రావడంతో అందరూ షాక్ అయ్యారు. అలాగే కవిత 10 ఫోన్లను మార్చినట్లు నివేదికలో తెలిపింది. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా కూడా చార్జ్ షీట్ లో ఈడీ పొందుపరిచింది. నిందితులను ఈడీ త్వరలోనే విచారించనుంది.