»Delete These Apps Immediately New Spyware Spinok Danger For Mobile User
Alert: ఈ యాప్స్ వెంటనే తొలగించండి..లేదంటే డేంజర్!
డాక్టర్ వెబ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు అనేక యాప్‌లలోకి ప్రవేశించిన కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్ను కనుగొన్నారు. ఇది గతంలో Google Play స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ కృత్రిమ మాల్వేర్ ఏకంగా 400 మిలియన్ సార్లు డౌన్లోడ్ చేయబడిందని గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ డాక్టర్ వెబ్ ప్రకారం 'SpinOk' అనే స్పైవేర్ ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ కింద ఉన్న యాప్స్ ఫోన్లలో ఉంటే తొలగించాలని సూచించారు.
స్మార్ట్ ఫోన్లు వాడే వారికి ఓ షాకింగ్ న్యూస్. కొత్తగా ‘స్పిన్ఓక్’ అని పిలిచే స్పైవేర్ మాడ్యూల్ వెలుగులోకి వచ్చిందని డాక్టర్ వెబ్ సైబర్ సెక్యూరిటీ రిపోర్ట్ వెల్లడించింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో నిల్వ చేయబడిన ప్రైవేట్ డేటాను తస్కరిస్తుందని చెబుతున్నారు. పలు రకాల యాప్స్ డౌల్ లోడ్ చేసుకోవడం ద్వారా ఇది ఫోన్లలోకి వస్తుందని అంటున్నారు. యాప్ డెవలపర్లు తమ యాప్‌లకు SpinOk మాడ్యూల్‌ని జోడించి ఉండవచ్చు. ఎందుకంటే ఇది మొదటి చూపులో చట్టబద్ధమైనదిగా కనిపిస్తుంది. దీంతోపాటు వినియోగదారులకు ఆసక్తిని కలిగించే లక్ష్యంతో “రోజువారీ రివార్డ్‌లను” అందించడానికి మినీగేమ్‌లను కూడా ఉపయోగిస్తుందని పేర్కొన్నారు.
డాక్టర్ వెబ్ నివేదిక ప్రకారం ఈ యాంటీవైరస్ తయారీదారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 421 మిలియన్ కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ చేయబడినట్లు తెలిపింది. ఈ జాబితాలో 101 యాప్‌లను కనుగొన్నట్లు పేర్కొంది. దిగువన, మీరు అత్యధిక డౌన్లోడ్లతో ప్రభావితమైన యాప్‌లను ఈ మేరకు ప్రకటించారు.
Noizz: సంగీతంతో వీడియో ఎడిటర్ – 100 మిలియన్ డౌన్లోడ్లు
జాప్యా – ఫైల్ బదిలీ, షేర్ – 100 మిలియన్ డౌన్లోడ్లు
vFly: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ – 50 మిలియన్ డౌన్లోడ్లు
MVBit – MV వీడియో స్టేటస్ మేకర్ – 50 మిలియన్ డౌన్లోడ్లు
Biugo – వీడియో మేకర్&వీడియో ఎడిటర్ – 50 మిలియన్ డౌన్లోడ్లు
క్రేజీ డ్రాప్ – 10 మిలియన్ డౌన్లోడ్లు
Cashzine – డబ్బు రివార్డ్ సంపాదించండి – 10 మిలియన్ డౌన్లోడ్లు
ఫిజ్జో నవల – ఆఫ్‌లైన్‌లో చదవడం – 10 మిలియన్ డౌన్లోడ్లు
CashEM: రివార్డ్‌లను పొందండి – 5 మిలియన్ డౌన్లోడ్లు
టిక్: సంపాదించడానికి చూడండి – 5 మిలియన్ డౌన్లోడ్లు
ప్రభావితమైన చాలా యాప్‌లు Play Store నుంచి తీసివేయబడినప్పటికీ అవన్నీ ఇంకా పూర్తిగా తొలగిపోలేదన్నారు. మీరు మీ Android స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌లలో ఏవైనా ఇన్స్టాల్ చేసి ఉంటే, వాటిని వెంటనే తొలగించాలని ఈ మేరకు సిఫార్సు చేశారు. అయితే ఈ యాప్‌లలో చాలా వరకు తాజా వెర్షన్లలో స్పైవేర్ తీసివేయబడింది. కాబట్టి మీరు వాటిని పూర్తిగా తొలగించే బదులు తాజా వెర్షన్‌కి అప్డేట్ చేయవచ్చని పేర్కొన్నారు. అయినప్పటికీ, మీ స్వంత భద్రత కోసం మీరు ఈ యాప్‌లను తొలగించడం ఉత్తమమని వెల్లడించారు.