అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో రేగిన కార్చిచ్చు కారణంగా అక్కడి స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ధనవంతుల ఇళ్లల్లోని విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. ఇప్పటికే 20 మంది దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎవరైనా వదిలేసిన ఆస్తులను లూటీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేశారు.