KDP: ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డు దస్తగిరిపేటలో సోమవారం ఖురేషీ మహమ్మద్ షాషా అనే మట్కా బీటర్ను అరెస్ట్ చేసి, అతని నుంచి రూ. 10,150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక 2వ టౌన్ ఎస్సై ధనుంజయ రెడ్డి తెలిపారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.