KDP: ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. దాసర్ల దొడ్డి బేస్ క్యాంపులో ఐదుగురు పనిచేస్తున్నారు. వారిలో ప్రొటెక్షన్ వాచర్ D వెంకటయ్యపై ఎలుగుబంటి గురువారం దాడి చేయగా అతని కుడి మోకాలుకు తీవ్రగాయమైంది. క్షతగాత్రుడిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు చింతరాజు పల్లె DY రేంజ్ అధికారి నాగూర్ నాయక్ తెలిపారు.