అక్కినేని నాగచైతన్య(Akkineni nagachaitanya), కృతిశెట్టి(Kritishetty) నటించిన కస్టడీ చిత్రం(Custody Movie) ఈ రోజు(మే 12న) విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీ చూసిన ప్రేక్షుకులు ఏం చెప్పారో ఇక్కడ చుద్దాం.
అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya) నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ(Custody Movie) ఈరోజు(మే 12న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కస్టడీ సినిమాకు తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతిశెట్టి(Actress Kritishetty) యాక్ట్ చేయగా.. పోలీస్ ఆఫీసర్ (Police Officer)గా నాగచైతన్య నటించారు. ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని ప్రీమియర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అవి ఎలా ఉన్నాయి. అసలు మూవీ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ఈ చిత్రంలో నాగచైతన్య, కృతి శెట్టి యాక్టింగ్ బాగుందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరోవైపు అరవిందస్వామి, వెన్నెల కిషోర్ యాక్టింగ్ కూడా అదుర్స్ అని చెబుతున్నారు. ఓవరాల్‌గా ఇది మంచి యాక్షన్ చిత్రమని పేర్కొన్నారు.
నాగచైతన్య ఈ యావరేజ్ ఫిల్మ్‌లో తమిళ స్టైల్లో విభిన్నంగా ప్రయత్నించాడని మరోవ్యక్తి అంటున్నారు. స్క్రీన్‌ప్లే స్లోగా ఉందని చెబుతున్నారు. అంతేకాదు అరవింద స్వామి పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని తెలిపారు. కామెడీ కూడా సరిగా వర్క్ అవుట్ కాలేదని పేర్కొన్నారు. ఇక ఓల్డ్ మ్యూజిక్, కృతి శెట్టి క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ లేదని చెబుతున్నారు.
ఇంకోవ్యక్తి అయితే కస్టడీ పిచ్చ లైట్ సినిమా అంటూ 2.5/5 రేటింగ్ ఇచ్చేశాడు
#Custody#CustodyReview Chay👌👌👌👌 Krithi ❤️❤️👍 Aravindswamy 🔥 🔥🔥 Vennela Kishore 😂😂😂😂 Overall a very good action film Nice screen play definitely action ekkuva undi but it’s obviously Venkat Prabhat style