»Ci Gopi The Cause Of My Death Was The Land Dispute That Cost Him His Life Karimnagar Bhopalpatnam
CI Gopi: నా చావుకు కారణం సీఐ గోపి..ప్రాణాన్నే బలిగొన్న భూ తగాదా
తన ఆత్మహత్యకు(suicide attempt) గల కారణం సీఐ(CI Gopi) అంటూ ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి మరి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా భూపాలపట్నంలో చోటుచేసుకుంది. మధ్యవర్తిగా ఉన్నందుకు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అసలు ఏం జరిగిందో ఇక్కడ చుద్దాం.
కరీంనగర్ జిల్లా(karimnagar district)లో ఓ భూ తగాదా(land dispute)వ్యక్తి ప్రాణాలు బలిగొంది. చొప్పదండి మండలంలోని భూపాలపట్నంలో బొడిగే శ్యామ్ అలియాస్ సాంబయ్య ఉరివేసుకొని ఆత్మహత్య(suicide attempt) చేసుకున్నాడు. తన చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సీఐ గోపి కారణమంటూ సూసైడ్ నోట్ రాసి మరీ.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు సాంబయ్య. భూపాలపట్నం గ్రామానికి చెందిన బొడిగే శ్యామ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పని చేస్తున్నాడు. అయితే…. భూపాలపట్నం(bhopalpatnam)లో బొడిగే శ్యామ్ 20 గుంటల భూమిని మధ్యవర్తిగా ఉండి… సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ గోపికి 45 లక్షల రూపాయలకు విక్రయించారు. కొన్ని నెలల తర్వాత ఆ భూమికి వాల్యూ 60 లక్షలకు పెరగడంతో..సీఐ అనుమతితో మధ్యవర్తిగా ఉండి బొడిగే శ్యామ్ ఇతరులకు కొనిపించాడు.
ఇక్కడి వరకూ భాగానే ఉంది.. ఆ పైనే అసలు కథ మొదలైంది. భూమి కొన్నవారు 5 లక్షలు అడ్వాన్సు ఇచ్చి, మిగతా డబ్బుకు 40 రోజుల తర్వాత ఇస్తామని అగ్రిమెంట్ రాసుకున్నారు. ఐతే అనుకున్న సమయానికి వారు డబ్బులు(money) చెల్లించలేదు. దాంతో భూమి(land) కొనుగోలులో.. మధ్యవర్తిగా ఉన్న బొడిగే శ్యామ్‌కు, సీఐ గోపి ఫోన్ చేసి డబ్బు కావాలని టార్చర్ పెట్టారు. రేపు, ఎల్లుండి అంటూ వాయిదా వేస్తూ వచ్చిన శ్యామ్, ఇక సీఐ వేధింపులు భరించలేక పోయాడు.
భూమి కొన్న మధ్యవర్తులు కూడా మరింత డిలే చేయడంతో… సీఐ(ci gopi) వేధింపులు ఎక్కువయిపోయాయి. సాంబయ్య ఆ టార్చర్ తట్టుకోలేకపోయాడు. ఇక చావే మేలు అనుకున్నాడు. ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు సీఐ గోపియే కారణమని సూసైడ్ నోట్ రాశాడు.
అంతేకాదు అగ్రిమెంట్ డీల్‌లో పాల్గొన్న తన బావను కూడా సీఐ(CI) దూషించాడని తెలిపాడు. అమ్మను సరిగ్గా చూసుకోవాలని పిల్లలకు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తనను తీవ్రంగా వేధించిన సీఐ గోపీపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరాడు బొడిగె శ్యామ్. ఇక ఆయన సీఐతో మాట్లాడిన రికార్డ్ంగ్స్ తో సహా ఉన్నాయని…మా నాన్నా చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశాడు ఆయన కొడుకు సంజయ్.