»Bhojpuri Actress Suman Kumari Arrested In Sex Racket Case At Mumbai
Actress: సెక్స్ రాకెట్ కేసులో నటి అరెస్ట్..అందుకే చేస్తుందంటా!
అమ్మాయిలను (మోడల్స్) వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలపై భోజ్‌పురి నటి సుమన్ కుమారి(Suman Kumari)(24)ని ముంబై పోలీసులు(mumbai police)అరెస్టు చేశారు. ఆ క్రమంలో ముగ్గురు మోడల్లను పోలీసులు రక్షించారు.
మహారాష్ట్రలోని ముంబై పోలీసులు(mumbai police) మెట్రోపాలిటన్ నగరంలో హై-ప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. ఆ క్రమంలో వ్యభిచారంలోకి నెట్టబడిన ముగ్గురు మోడల్లను రక్షించడంతోపాటు ప్రముఖ భోజ్‌పురి నటిని అరెస్టు చేశారు.
ఆర్ఏ కాలనీ ప్రాంతంలోని రాయల్ పామ్ హోటల్లో సెక్స్ రాకెట్ నడుపుతున్న భోజ్‌పురి నటి సుమన్ కుమారి(Suman Kumari)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వద్దకు కస్టమర్ల రూపంలో పోలీసులు వెళ్లి ఈ సెక్స్ రాకెట్ గుట్టును చాకచక్యంగా ఛేదించారు. ఈ నటి ఒక్కో మోడల్‌కు 50,000 నుంచి 80,000 రూపాయల వరకు పంపుతున్నట్లు తెలిసింది.
మరోవైపు తనకు చలనచిత్ర పరిశ్రమలో పని దొరక్కపోవడంతోనే ఆ విధంగా మోడల్లను వ్యభిచారం(sex racket)లోకి తీసుకొచ్చి ఆ పనులు చేయినట్లు నటి తెలిపింది. ఈ నటి అనేక భోజ్‌పురి సినిమాలు, కామెడీ షోలలో నటించింది. గత ఆరు సంవత్సరాలుగా ముంబైలో నివసిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆమెను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.