SKLM: నాటుసారా నివారణ చర్యలలో భాగంగా బుధవారం సోంపేట, మందస మండలాలలో ఆకస్మిక దాడులు నిర్వహించి రెండు కేసులు నమోదు చేశారు. ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 18.2 లీటర్ల నాటు సారా సీజ్ చేశారు. అదేవిధంగా సోంపేట ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె.బేబీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు.