W.G: కొవ్వూరు మండలం దొమ్మేరులో ఓ వ్యక్తిపై ఆదివారం బీరు సీసాతో దాడిచేసిన ఘటన చోటుచేసుకుంది. దాడి చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు పట్టణ పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన మారి, ఫణి ఆదివారం మధ్యాహ్నం మహేశ్‌తో గొడవపడి దుర్భాషలాడారు. అనంతరం అతని ఇంటికి వెళ్లి మహేశ్‌ను కొట్టి, బీరు సీసాతో గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.