»Case Of Not Providing Car Parking Space Go Green Builders Fined
Car parking space: ఇవ్వలేదని కేసు..గో గ్రీన్ బిల్డర్స్‌కు లక్ష జరిమానా
ఓ వ్యక్తి ప్లాట్ కొన్నాడు. కానీ అతనికి చెప్పిన ప్రకారం రియల్ ఎస్టేట్ బిల్డర్ కారు పార్కింగ్ స్పేస్ ఇవ్వలేదు. దీంతో బాధితుడు అతనిపై వినియోగదారుల ఫోరం(consumer court)లో కేసు పెట్టాడు. దీంతో కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఓ ప్లాట్ కొనుగోలు ఒప్పందంలో భాగంగా హామీ ఇచ్చిన ఫ్లాట్‌తోపాటు కారు పార్కింగ్ స్పేస్ ఇవ్వనందుకు ఓ వ్యక్తి బిల్డర్ పై వినియోగదారుల ఫోరం(consumer court)లో కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓల్డ్ అల్వాల్‌లోని ఫ్లాట్ యజమాని జమ్ము వెంకటేశ్వర్రావుకు నష్టపరిహారంగా రూ.75,000, ఖర్చుల నిమిత్తం రూ.25,000 చెల్లించాలని గో గ్రీన్ బిల్డర్లను తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆర్డర్ వచ్చిన 30 రోజులలోపు ఒప్పందం ప్రకారం PNB హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కార్ పార్కింగ్‌కు అవసరమైన ఆక్యుపేషన్ సర్టిఫికేట్‌ను అందజేయాలని బిల్డర్‌కు సూచించింది.
అయితే తాను కొనుగోలు చేసిన ఫ్లాట్ నుంచి బిల్డర్ తనను బలవంతంగా గెంటేశారని ఆక్యుపేషన్ సర్టిఫికెట్, కార్ పార్కింగ్(car parking) ఇవ్వడానికి నిరాకరించాడని ఆరోపిస్తూ జనవరి 11, 2019న గో గ్రీన్ బిల్డర్స్పై.. వెంకటేశ్వర్ రావు కేసు పెట్టారు. ఓల్డ్ అల్వాల్‌లోని భూపతి నగర్లో ఉన్న గో గ్రీన్ హైట్స్‌లోని ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన క్రమంలో స్పెసిఫికేషన్లు, సౌకర్యాలు ఉన్న బిల్డర్ బ్రోచర్‌ను ఫిర్యాదుదారు గుర్తు చేశారు. దాని ఆధారంగా అతను 1,600 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాతో రెసిడెన్షియల్ ఫ్లాట్ నంబర్ 502ని కొనుగోలు చేయడానికి అంగీకరించానని వెల్లడించారు. దీంతోపాటు ఒక కారు పార్కింగ్, బెడ్రూమ్లు, హాల్, డైనింగ్ హాల్, కిచెన్లలో ఫాల్స్ సీలింగ్ వంటి సౌకర్యాలతో 63.54 చదరపు గజాలతో మొత్తం రూ. 44,50,000 అయినట్లు వెల్లడించారు.
ఆ క్రమంలో వెంకటేశ్వర్ రావు బిల్డర్ తో సేల్ అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ గా రూ.11,00,000 చెల్లించాడు. నాలుగు నెలల గ్రేస్ పీరియడ్‌తో 12 నెలల్లో ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవడానికి బిల్డర్ అంగీకరించారు. ఫ్లాట్ యజమాని PNB హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కూకట్పల్లి బ్రాంచ్ నుంచి హౌసింగ్ లోన్‌ను పొందాడు. ఫ్లాట్‌ను పూర్తి చేయడానికి ముందు బిల్డర్ ఫిర్యాదుదారు(complaint)కు అనుకూలంగా సెమీ-ఫినిష్డ్ ఫ్లాట్ కోసం రిజిస్టర్డ్ సేల్ డీడ్‌ను అమలు చేశాడు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో అసంపూర్తిగా ఉన్న గోడలు, తలుపులు, కిటికీలు, టాయిలెట్లు, శానిటరీ టైల్స్, ప్లంబింగ్ పనులు, ఫ్లోరింగ్ విద్యుద్దీకరణ, పెయింటింగ్ పనులు గో గ్రీన్ బిల్డర్ ఆరు నెలల్లో పనిని పూర్తి చేయడానికి అంగీకరించారు. కానీ అది విఫలమయ్యారని పేర్కొన్నారు.