WGL: జిల్లా నెక్కొండ మండలంలోని రామన్న కుంట తండ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రామన్నకుంట తండా గ్రామానికి చెందిన గుగులోతు భాస్కర్ కుమారుడు విక్కీ (6)కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.