#ByeByeJaganIn2024: 2024లో బై..బై.. జగన్.. వైసీపీ పని అయిపోయిందన్న అనురాధ
'MLC ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో TDP 46%, YCP 29%. తూర్పు రాయలసీమలో TDP 44%, YCP 35% ఓట్లు. జగన్ పని అయిపోయింది.' అని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ట్వీట్ చేసారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయం దిశగా దూసుకు పోతోంది. ఏపీలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా… ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ విజయం దిశగా సాగుతోంది. పశ్చిమ రాయలసీమలో మాత్రం వైసీపీ స్వల్ప ఆధిక్యంతో ఉన్నది. రెండు స్థానాలు టీడీపీకీ ఖాయమని దాదాపు తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. కీలకమైన రెండు ఎమ్మెల్సీ స్థానాలను కోల్పోతుండటంతో తెలుగు దేశం పార్టీ ట్విట్టర్ లో ప్రారంభించిన #ByeByeJaganIn2024 అంటూ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. 2024లో బైబై… జగన్ అంటూ ఈ సందర్భంగా పలువురు ట్విట్టరిటీలు తమదైన శైలిలో స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ట్వీట్ చేసారు. ‘3 రాజధానులకు వ్యతిరేకంగా ప్రజల భావన వ్యక్తమవుతుందని వైసీపీ నేతలే ఒప్పుకుంటున్నారు. అభివృద్ధే తమ నినాదమని ఉత్తరాంధ్ర ప్రజలు చాటి చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా గెలుస్తాం.’ అంటూ పేర్కొన్నారు.
‘MLC ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో TDP 46%, YCP 29%. తూర్పు రాయలసీమలో TDP 44%, YCP 35% ఓట్లు. జగన్ పని అయిపోయింది.’ అని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ట్వీట్ చేసారు.
‘జగన్ పతనం ప్రారంభమైంది. వైసీపీ అంతానికి ఆరంభం ఇదే. సైకో పోవాలి – సైకిల్ రావాలి’
‘రావద్దు జగన్ మాకొద్దు జగన్ Mood of andhra pradesh’
‘ఢిల్లీలో జగన్ రెడ్డి బస చేసిన హోటల్ లో పగులుతున్న టీవిలు’
‘టిడిపి కార్యకర్తలు సంబరాలు. బాబు గారు పోరాటం ఎప్పుడు ఆపరు’
‘పసుపు పేరు చెప్పితే పరుపు తడుపుకునే బ్యాచ్’
‘రాయలసీమలో కూడా వైసీపీకి వ్యతిరేక పవనం.. న్యాయ రాజధాని కట్టు కథలు నమ్మని సీమవాసులు.. ఒక్క ఛాన్స్ గాలి వాటానికి శుభం కార్డు.. వైసీపీలో “మొదలైన మార్పు” ఒణుకు..’
‘ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో సోదిలో లేని వైసీపీ. పశ్చిమ రాయలసీమలో టీడీపీ హోరాహోరీ పోటీ.. తగ్గుతున్న వైసీపీ ఆధిక్యం. మూడవ రౌండ్ – 76, నాల్గవ రౌండ్ – 22, ఐదవ రౌండ్ – 7 ‘
‘సైకో పోతున్నాడు సైకిల్ రాబోతుంది’ అంటూ అభిమానులు, కార్యకర్తలు ట్వీట్ చేస్తున్నారు.