రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబ్ కెమడియన్(Youtube Comedian) మృతిచెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్ లో చోటుచేసుకుంది. తెలిబంధ పోలీస్ స్టేషన్ పరిధిలోని లభండి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరాజ్ పటేల్ (Devaraj Patel) మరణించాడు. బైక్, లారీ ఢీకొన్న ప్రమాదం(Road Accident)లో ఆయన చనిపోయారు. లారీ అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో దేవరాజ్ పటేల్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
“दिल से बुरा लगता है” से करोड़ों लोगों के बीच अपनी जगह बनाने वाले, हम सबको हंसाने वाले देवराज पटेल आज हमारे बीच से चले गए.
इस बाल उम्र में अद्भुत प्रतिभा की क्षति बहुत दुखदायी है.
గతంలో సీఎం భూపేష్ బఘేల్‌తో భేటీ సందర్భంగా పటేల్ ఓ వీడియో చేసి ఫేమస్ అయ్యారు. ఆ వీడియో నెట్టింట చాలా వైరల్ అయ్యింది. ఒక్క వీడియోతో దేవరాజ్ రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. దేవరాజ్ పటేల్ ప్రసిద్ధ యూట్యూబర్ భువన్ బామ్‌తో కలిసి 2021 సంవత్సరంలో కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ధింధోరాలో వర్క్ చేశారు. యూట్యూబర్ మృతిపై సీఎం భూపేష్ బఘెల్ సంతాపాన్ని తెలియజేశారు.