వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో ఏపీ(AP)లో ఒక్క పాఠశాల కూడా మూతపడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) పేర్కొన్నారు. ఏ ఊరిలో పాఠశాలను మూసేశారో తెలపాలని టీడీపీ(TDP) సభ్యులను డిమాండ్ చేశారు. మరోవైపు చంద్రబాబు(chandrababu Naidu) హయాంలోనే 5000 స్కూళ్లు మూతపడ్డాయని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) టీడీపీ(TDP) నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో ఒక్క పాఠశాల కూడా మూతపడలేదని, ఏ ఊరిలో పాఠశాలను మూసేశారో తెలపాలని టీడీపీ సభ్యులను డిమాండ్ చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడిన క్రమంలో స్పష్టం చేశారు. ఏపీలో స్కూళ్ల(schools) మూసివేతపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను బొత్స ఖండించారు.
మరోవైపు చంద్రబాబు నాయుడు(chandrababu Naidu) హయాంలో 5000 పాఠశాలలు మూతపడ్డాయని బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) తెలిపారు. ఆ తర్వాత వైఎస్ జగన్(jagan) సీఎం అయిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించారని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఏ ఊరిలో పాఠశాలలు(schools) మూతపడ్డాయో ప్రతిపక్షాలు చెప్పాలని బొత్స నిలదీశారు. ఇలాంటి సమస్యల వివరాలను సభకు తీసుకురావాలని బొత్స(Botsa) కోరారు. ప్రతినెలా రెండుసార్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖపై(education department) సమీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోషియో ఎకనామికన్ సర్వేను సీఎం జగన్(cm jagan) మోహన్ రెడ్డి బుధవారం రిలీజ్ చేశారు. మరోవైపు ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అంబటి రాంబాబు(ambati rambabu) అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఎవరు ఎంత ఖర్చు చేశారో అందరికీ తెలుసని మంత్రి ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు(tdp leaders) అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనని…సభను తప్పుదొవ పట్టిస్తున్నారని అంబటి పేర్కొన్నారు.