సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న పరుశురాములు మంగళవారం తన కింది ఉద్యోగి వద్ద రూ.11,500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. దీంతో అతనిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పరచనున్నట్లు మెదక్ రేంజ్ ఎసీబీ డిఎస్పి సుదర్శన్ తెలిపారు.