TG: వనపర్తి జిల్లా పెబ్బేరు దగ్గర జాతీయ రహదారి 44పై దారి దోపిడీ జరిగింది. ఆగి ఉన్న కారుపై దొంగలు రాళ్లు, కర్రలతో దాడి చేసి కారులో ఉన్న మహిళల నుంచి 14 తులాల బంగారం చోరీ చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పీఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు జగిత్యాల జిల్లా కొత్తూరువాసులు కాగా, తిరుపతికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.