»Arshiya Goswami A Child Who Lifted 62 Kg At The Age Of 8 Is A Guinness Record Holder
Arshiya Goswami: 8 ఏళ్లకే 62 కేజీలు ఎత్తి చిన్నారి గిన్నిస్ రికార్డు
హర్యానా(haryana)కు చెందిన ఎనిమిదేళ్ల ఏండ్ల చిన్నారి అర్షియా గోస్వామి(Arshiya Goswami) ఓ అరుదైన ఘనతను సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సత్తా చాటింది. ఎనిమిదేళ్ల వయస్సులోనే 62 కిలోల బరువు ఎత్తి ఔరా అనిపించుకుంది.
హర్యానా(haryana)కు చెందిన అర్షియా గోస్వామి(Arshiya Goswami) టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తన వయసు వారు ఎవరూ చేయలేని పని చేసింది. ఏకంగా 62 కిలోల బరువును(lifted 62 kg) అవలీలగా ఎత్తేసింది. చిన్న వయసులోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో సత్తా చాటింది. కేవలం 30 సెకన్లలోనే 17 సార్లు బరువులను ఎత్తిపారేసింది. అయితే అర్షియా గోస్వామి తండ్రి అవనీశ్ కుమర్ గోస్వామి పంచకుల జిల్లాలో జిమ్ సెంటర్ నడుపుతున్నాడు. అర్షియా ఆ జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకుంది. ఆమెను తండ్రి ప్రోత్సహించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ గుర్మెల్ సింగ్ దగ్గర అర్షియా ట్రైనింగ్ తీసుకుంటోంది.
గత కొంత కాలంగా అర్షియా గోస్వామి వార్తల్లో నిలుస్తూ వస్తోంది. వివిధ టోర్నీలలో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. మీరాభాయ్ చాను నుంచి స్పూర్తి పొందిన అర్శియా గోస్వామి రానున్న రోజుల్లో భారతదేశానికి బంగారు పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హర్యానా అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా 8 ఏళ్ల అర్షియా గోస్వామిని అభినందించారు. ఇండియాస్ గాట్ టాలెంట్ ప్రపంచ రికార్డును(Guinness record) బద్దలు కొట్టినందుకు అభినందనలు తెలియజేశారు. మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పంచకులానికి కొలువులు తెచ్చిపెట్టిందని అన్నారు.