»Ap Somu Veerraju Reacts On Pawan Kalyan Delhi Tour
JanaSena, బీజేపీ కలిసే ఉన్నాయి: పవన్ ఢిల్లీ పర్యటనపై సోము వీర్రాజు
వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై మేం పోరాడుతాం. తమ పార్టీలు రెండూ కలిసి ఉన్నాయని స్పష్టం చేశారు. జగన్ లో మార్పు రాకుంటే కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేపడతా’ అని ప్రకటన చేశారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఆసక్తికరంగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో (JP Nadda) ఇతర కేంద్ర పెద్దలతో పవన్ సమావేశమైన విషయం తెలిసిందే. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ (YS Jagan)ను ఓడించడమే తన లక్ష్యమని పవన్ ప్రకటించాడు. రానున్న ఎన్నికల్లో కాషాయ పార్టీతో కలిసే పోటీ చేస్తామని పరోక్షంగా తెలిపారు. కాగా పవన్ ఢిల్లీ పర్యటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) స్పందించారు. తమ పార్టీలు రెండూ కలిసి ఉన్నాయని స్పష్టం చేశారు.
విజయవాడలో బుధవారం బాబూ జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ‘జనసేన, బీజేపీ కలిసి ముందుకువెళ్తాయి. మేం కలిసే ఉన్నాం. వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై మేం పోరాడుతాం’ అని కుండబద్దలు కొట్టి చెప్పారు. పవన్, చంద్రబాబు మైత్రిపై స్పందిస్తూ.. ‘చంద్రబాబుతో పవన్ కల్యాణే కాదు నేను కూడా చాలా సందర్భాల్లో సమావేశమయ్యాను. రాజకీయాల్లో వివిధ పార్టీల నేతలు కలవడం సర్వసాధారణ విషయం. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ పాలనపై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెద్ద ఎత్తున జరిగాయి. ఏపీలో హైంధవ ధర్మం అపహాస్యం అవుతోంది. ఫిరంగిపురంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. జగన్ లో మార్పు రాకుంటే కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేపడతా’ అని ప్రకటన చేశారు.
అసెంబ్లీ నుండి దేశ ఉప ప్రధాని వరకు అనేక స్థాయిల్లో పనిచేసి సమాజంలో అణగారిన వర్గాలు , అసమానతలు మరియు దేశ సేవలో తన జీవిత కాలంలో అనేక కీలక భూమిక పోషించిన పెద్దలు శ్రీ బాబూ జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా విజయవాడలో వారి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించాను. @blsanthoshpic.twitter.com/hMd21cq1d1
— Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar) (@somuveerraju) April 5, 2023