ఏపీ(AP)లో కాంట్రాక్ట్ ఉద్యోగుల(Contract Employees) క్రమబద్దీకరణకు సీఎం జగన్(Cm Jagan) అధ్యక్షతన జరిగిన కేబినెట్(Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ఏడాది అమ్మఒడి పథకం(Ammaodi Scheme) అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విద్యా కానుక(Vidya Kanuka) పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కూడా మంత్రులు పచ్చజెండా ఊపారు.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్(Global Investor Summit)లో ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్(Cabinet) ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవే కాకుండా జగనన్న ఆణిముత్యాలు పథకం అమలు, 12వ పీఆర్సీ(PRC) నియామకం, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్(GPS) అమలు వంటివాటికి ఆమోదం తెలుపుతూ మంత్రుల కేబినెట్(Cabinet) నిర్ణయం తీసుకుంది.
ఈ కేబినెట్(Cabinet) భేటీలో మొత్తం 63 అంశాలకు సంబంధించి మంత్రుల వర్గం ఆమోదం తెలిపింది. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహా రెవెన్యూ లోటు, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)కు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం గురించి ఆ ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై కేబినెట్(Cabinet)లో మంత్రులు చర్చలు జరిపారు.