»Akkinenis House Is Deeply Saddened Nagarjunas Sister Naga Saroja Passed Away
Nagarjuna Sister Death: అక్కినేని ఇంట తీవ్ర విషాదం.. నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూత
హీరో నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూశారు. దీంతో అక్కినేని కుటుంబం ఇంట విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల సమక్షంలో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.
అక్కినేని ఇంట (Akkineni Family) తీవ్ర విషాదం నెలకొంది. స్వర్గీయ అక్కనేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao) కూతురు, నాగార్జున సోదరి అయిన నాగ సరోజ (Naga Saroja) కన్నుమూశారు. మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. నాగ సరోజ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె సినిమా రంగానికి చాలా దూరంగా ఉంటారు. నాగ సరోజ మరణవార్త అందుకే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుకి సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్, నాగార్జున ఇలా ఐదుగురు సంతానం ఉన్నారు. అందులో నాగ సరోజ మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి ఆమె ఆరోగ్యం బాగోలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్యానికి ఆమె శరీరం సహకరించకపోవడంతో తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెకు అంత్యక్రియలు జరిగినట్లు సమాచారం.