Accident on Tirumala road. Six devotees seriously injured
Tirupathi: తిరుమల ఘాట్ రోడ్డులో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రెండో ఘాట్ రోడ్డులో గోవింద మలుపు వద్ద అతి వేగంతో కారు రైవిలింగ్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు టైరు పంక్చర్ అయింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు మీదకు రావడంతో వెనుకనుంచి వచ్చిన మరో కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు విజవాడ నుంచి వస్తున్నట్లు తెలుస్తుంది. కారులో ఇద్దరు వృద్దులు ఉండగా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్సకోసం వీరందరిని తిరుమల ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదానికి కారణం కారు అతివేగమే అని చెప్పారు. దర్శణం చేసుకుని వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాహనాలను ఠానాకు తరలించారు. తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలపై టిటిడి ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని కట్టడిచేసే దిశగా అధికారులను అప్రమత్తం చేసింది. దిగువ ఘాట్ రోడ్డులో ఏడో మైలు శ్రీ ప్రసన్న అంజనేయస్వామి విగ్రహాం వద్ద ఈ ప్రమాదాల నావారణకు మహాశాంతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరుస ఘాట్ రోడ్డు ఘటనలపై చిత్తురు జిల్లా కలెక్టర్ ఎస్పీ, ఆర్టీసీ ఆఎంలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిని చర్యలను.. జిల్లా స్థాయి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందిగా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే విజులెన్సు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని అప్రమత్తం కావాలని తెలిపారు.
ఘాట్ రోడ్డులలో ప్రమాదాలు నివారణకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా భక్తులు కోరుతున్నారు. మాములు సమయాల్లో కన్నా వర్షకాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయని, రోడ్లు తడిగా ఉండడంతో వాహనాలు కంట్రోల్ కావని అలాగే కొండ చెరియలు విరిగిపడుతుంటాయని పేర్కొన్నారు. ఇక అనుకొని ప్రమాదాలు జరిగినప్పుడు ఇక్కడ చూసే వారు కూడా ఎవరు ఉండరని, కనీసం ఇక్కడ అధికారులు ఉండేలా చర్యలు తీసుకుంటే ఆసుపత్రికి త్వరగా తీసుకు వెళ్లే అవకాశం ఉంటుందని భక్తులు తెలుపుతున్నారు.