యాదగిరిగుట్ట నుండి తిరుపతి వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు వనపర్తి జిల్లాలోని కొత్తకోట వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో పదిహేను మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సమయంలో బస్సులో 37 మంది వరకు ఉన్నారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారి కోసం 108 ని రప్పించారు. మిగతా ప్రయాణికులను వారి వారి స్వస్థలాలకు పంపించారు.
గాయపడ్డ వారిని వనపర్తి హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో చోటు చేసుకున్నది. రాత్రి సమయంలో కావడంతో బస్సు వేగంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బస్సు అదుపు తప్పి, జాతీయ రహదారి నుండి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.