»Abolition Of Muslim 4 Reservation Quota In Karnataka
Muslim Reservation: కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు
కర్నాటక ప్రభుత్వం శుక్రవారం ఇతర వెనుకబడిన తరగతుల (OBC) ముస్లింలకు 4 శాతం(Muslim 4% Reservation) కోటాను రద్దు చేసింది. ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల(Reservations) కోసం రెండు కొత్త కేటగిరీలను ప్రకటించింది. ఇప్పుడు 4 శాతం ఓబీసీ ముస్లిం కోటాను వొక్కలిగాలు, లింగాయత్‌ల మధ్య విభజించారు. కోటాకు అర్హులైన ముస్లింలు ఇప్పుడు ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్(EWS) కేటగిరీలో 10 శాతం కిందకు చేర్చబడ్డారు.
కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల కోసం రెండు కొత్త కేటగిరీలను ప్రకటించింది. ఇతర వెనుకబడిన తరగతుల (OBC) ముస్లింలకు(Muslim 4% Reservation) ఉన్న 4 శాతం కోటాను రద్దు చేసింది. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కేవలం నెల రోజుల ముందు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(basavraj bommai) కీలక ప్రకటన చేశారు. 4 శాతం ఓబీసీ ముస్లిం కోటాను.. వొక్కలిగాలు, లింగాయత్‌లకు కేటాయించారు. కోటాకు అర్హులైన ముస్లింలు ప్రస్తుతం ఆర్థికంగా బలహీన వర్గాల కేటగిరీలో వర్గీకరించబడ్డారు. ఈ నేపథ్యంలో మతపరమైన మైనారిటీలను ఈడబ్ల్యూఎస్(EWS) కేటగిరీలో 10 శాతం కిందకు తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది.
నాలుగు శాతం (మైనారిటీలకు రిజర్వేషన్) 2C, 2D మధ్య రెండుగా విభజింజబడ్డాయి. ఈ నేపథ్యంలో వొక్కలిగాలు, ఇతరులకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు ఆరు శాతానికి చేరనున్నాయి. వీరశైవ పంచమసాలీ, ఇతరులు (లింగాయత్‌లు) ఐదు శాతం పొందుతుండగా వారు ఇకపై శాతం ఏడు శాతం పొందుతారని సీఎం వివరించారు. ఈ క్రమంలో కేబినెట్ వొక్కలిగస్, లింగాయత్‌లకు వరుసగా 3A, 3B కేటగిరీల రిజర్వేషన్లను(Reservations) రద్దు చేసింది. వాటి స్థానంలో గత డిసెంబర్లో 2C, 2D అనే రెండు కొత్త కేటగిరీలను చేర్చింది.
ఈ నేపథ్యంలో ముస్లింల కోటాను రద్దు చేయాలనే నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు సీఎం(basavraj bommai) తెలిపారు. ఈ క్రమంలో మతపరమైన మైనారిటీలకు రాజ్యాంగపరమైన నిబంధనలు లేవని బొమ్మై అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీలకు కల్పించిన రిజర్వేషన్లను కొట్టివేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. అంతకుముందు కర్ణాటకలో 50 శాతం రిజర్వేషన్లు ఉండగా ఇప్పుడు అవి 56 శాతానికి చేరాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో బ్రహ్మణులు, వైశ్యులు, ముదలియర్లు, జైనులు ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్నారు.