BPT: అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో గురువారం ఓ వ్యక్తి గుండ్లకమ్మ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను గుండ్లకమ్మ నదిలో దూకే సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు వారించేలోపే అతను దూకేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.