MDK: పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. నార్సింగి గ్రామానికి చెందిన బోడ రాజు కుమార్తె అకిల(16) విద్యార్థినిని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో కాళ్లు నుజ్జునుజ్జు కాగా మరో విద్యార్థికి గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణం అని అన్నారు.