»A Man Climb Radio Tower Want Dalitha Bandhu Scheme
Vammo..ఏంది ఇదీ.. దళితబంధు కావాలని, ఇలా చేస్తావా..?
హైదరాబాద్ శివారులో నర్సింగ్ రావు అనే వ్యక్తి తనకు దళితబంధు పథకం ఇవ్వడం లేదని వినూత్నంగా నిరసనకు దిగాడు. రేడియో టవర్ ఎక్కి మరీ తన గోడును వెల్లబోసుకున్నాడు.
A Man climb Radio tower want dalitha bandhu scheme
Man climb Radio tower:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు (Dalitha bandhu) పథకం కొందరికీ అందుతోంది. గ్రామంలో ఒకరిద్దరికీ మాత్రమే వస్తోంది. నగదు మొత్తం ఎక్కువ కావడం.. పథకం కోసం ఎదురుచూసే వారు చాలా మందే ఉన్నారు. అధికార పార్టీ కార్యకర్తలకే (workers) పథకం అందుతుందనే విమర్శ ఉంది. హైదరాబాద్ (hyderabad) శివారులో ఒకతను తనకు పథకం ఇవ్వడం లేదని వినూత్నంగా నిరసనకు దిగాడు.
లింగోజిగూడ డివిజన్‌కు చెందిన నర్సింగ్ రావు (narsingh rao) అనే వ్యక్తి తనకు దళితబంధు పథకం కావాలని అంటున్నాడు. అందుకోసం ఎల్బీనగర్ (lb nagar) చింతలకుంటలో రేడియో టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. లింగోజిగూడా బస్తీలో దళితబంధు పథకంతోపాటు సీఎం కేసీఆర్ (cm kcr) ప్రకటించిన ఇళ్లు లేని పేదలకు రూ.3 లక్షల స్కీమ్ (3 lakhs scheme) ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.
తనకు దళితబంధు (dalitha bandhu) పథకం ఇవ్వాలని సీఎం కేసీఆర్ (cm kcr), గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, కలెక్టర్, ఇతర అధికారులకు ఇదివరకే లేఖ రాశానని వివరించారు. తన గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నాడు. అందుకే అంబేద్కర్ జయంతి (ambedkar) రోజున టవర్ ఎక్కి నిరసనకు దిగానని చెబుతున్నాడు. తన డిమాండ్ నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు.
సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో (cintamadaka) దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారని నర్సింగ్ రావు గుర్తుచేశాడు. తనకు మాత్రం ఇవ్వడం లేదని అంటున్నాడు. తన పట్ల వివక్ష చూపుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాడు.