»A Bus Going To Modis Rally Collided With A Truck Three People Were Killed Chhattisgarh
Bus collided: ట్రక్కును ఢీకొట్టిన..మోడీ ర్యాలీకి వెళ్తున్న బస్సు..ముగ్గురు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారత ప్రధానమంత్రి బహిరంగ సభకు హాజరయ్యేందుకు బయలుదేరిన బస్సు వెనుక నుంచి ఓ టిప్పర్ లారీని ఢీ కొట్టింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్‌లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 47 మంది భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ఓ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. బిలాస్పూర్ సమీపంలోని రాయ్‌పూర్‌లో జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పార్టీ కార్యకర్తలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఆ నేపథ్యంలో ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. భారీ వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును బస్సు డ్రైవర్ స్పష్టంగా చూడలేకపోయాడని, ఫలితంగా ఢీ కొట్టినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. ఇక గాయపడిన క్షతగాత్రులను బిలాస్‌పూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ప్రధాని మోడీ సభ జరగనుంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న అక్కడి ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ విచారం వ్యక్తం చేశారు. ఒక్కో బాధితుడి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.