MNCL: జన్నారం మండలంలోని పాత పోన్కల్ గ్రామంలో బుధవారం పిడుగు పడి సర్వీస్ వైర్ కాలిపోయింది. పాత పోన్కల్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత మూలమలుపు వద్ద తాటిచెట్టుపై పిడుగు పడింది. దీంతో పక్కనే ఉన్న ఉప్పర్ల లచ్చన్న ఇంటిలో సర్వీస్ వైరు కాలిపోయి ఇంటి గోడకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంటిలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగడం లేదు.