KDP: దువ్వూరు మండలం కానగూడూరులో సోమవారం తండ్రి చేతిలో కొడుకు హత్య గురైన సంఘటన జరిగింది. వివరాలకు వెళితే పీరయ్య గారి హుస్సేన్ భాష(23 ) నిత్యం తాగి ఇంట్లో వారిని వేధిస్తుండగా తండ్రి మాబు షరీఫ్ రోకలి బండతో తలపై కొట్టాడు. హుస్సేన్ భాషను హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మద్యంలో మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న దువ్వూరు పోలీసులు హత్యపై కేసు నమోదు చేశారు.