RR: ఇబ్రహీంపట్నం పరిధి రాయపోల్-ఏన్లగూడ రోడ్లో మహిళా కానిస్టేబుల్ హత్య కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి నెలరోజుల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కాగా, ఈరోజు ఉదయం డ్యూటీకి స్కూటీపై వెళ్తుండగా ఆమె తమ్ముడు కారుతో ఢీకొట్టాడు. కిందపడిన ఆమెను కత్తితో మెడపై నరికి హత్య చేశాడు.