VSP: విశాఖపట్నం కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా పండుగ రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. గవర కంచరపాలెం ప్రాంతానికి చెందిన బత్తిన ఈశ్వరరావు (52) కంచరపాలెం మెట్టు వద్ద టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. గాలివాన కారణంగా తెగిన విద్యుత్ సర్వీస్ వైర్ ఒక్కసారిగా ఆయనపై పడింది. దీంతో ఈశ్వరరావు మృతిచెందాడు.