రోడ్డు ప్రమాదంలో ఓ యువ IPS మృతిచెందిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. హాసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్ స్వీకరించేందుకు వెళ్తుండగా మధ్యప్రదేశ్‌కు చెందిన కర్ణాటక కేడర్ 2023 బ్యాచ్ IPS హర్ష్‌బర్ధన్ (26) ప్రయాణిస్తున్న వాహనం టైరు పగిలి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. బర్ధన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు.