TG: ఇబ్రహీంపట్నంలో జరిగిన పరువు హత్య కేసులో మృతురాలు నాగమణి భర్త శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు నాగమణి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని గతంలోనే ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. 8 ఏళ్లుగా నాగమణితో ప్రేమలో ఉన్నట్లు పేర్కొన్నాడు. నాగమణి కానిస్టేబుల్ అయ్యేందుకు సహకరించానని, 2021లో నాగమణికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందన్నాడు. గత నెలలో యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నామని వెల్లడించాడు.