E.G: రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లో సుమారు 55 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడని రాజమండ్రి జీఆర్పీ ఎస్సై లోవరాజు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతుడిని గర్తించిన వారు 9440627551 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.