KMM: సత్తుపల్లి పట్టణంలో హనుమాన్‌నగర్ ఎదురుగా ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశ్వరావుపేట వైపుగా వెళ్తున్న కారుకు సైకిల్ అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న పాఠశాల బస్సును ఢీకొంది. ఈ సమయంలో బస్సులో 50మందికి పైగా పిల్లలు ఉండగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.