PDPL: మంథని పీఎస్ పరిధిలోని భట్టుపల్లి శివారు మైసమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగలిపల్లి గ్రామానికి చెందిన పిడుగు రాజ్ కుమార్ (33), దామెరకుంట గ్రామానికి చెందిన రాంశెట్టి కిష్టయ్య (39) టీవీఎస్ జూపిటర్ స్కూటీపై మేడారం వెళ్లి, బుధవారం తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.