RR: రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలో చోటు చేసుకుంది స్థానికుల వివరాలు. చేగుంట నుంచి సంతాపూర్ గ్రామానికి వెళ్తున్న డీసీఎం వాహనం సంతాపూర్ గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.