31 tribals:సుడాన్లో మిలిటరీ, పారామిలిటరీ మధ్య జరుగుతోన్న ఘర్షణలో ఇప్పటివరకు 200 మంది (200 people) చనిపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. బయటకు రావొద్దు అని అధికారులు ఆదేశాలు జారీచేశారు. సుడాన్లో (sudan) కర్ణాటకకు (karnataka) చెందిన 31 మంది హక్కీ పిక్కీ తెగకు చెందిన గిరిజనులు (tribals) చిక్కుకున్నారు. వారిని స్వదేశం తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ (congress) అంటోంది. అధికార బీజేపీపై (bjp) విమర్శలు గుప్పించింది.
ఆ 31 మంది (31 people) హక్కీ పిక్కీ గిరిజన తెగకు చెందినవారు. ఘర్షణతో అక్కడ వారికి తగిన ఆహార పదార్థాలు లేవు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ (congress) ప్రస్తావిస్తోంది. సుడాన్లో (sudan) ఉన్న గిరిజనులను (tribals) ఎందుకు స్వదేశం తీసుకురావడం లేదని ప్రశ్నిస్తోంది. కేంద్రంలో ఉన్న మోడీ (modi) , రాష్రంలో ఉన్న బొమ్మై (bommai) ప్రభుత్వాలకు కన్నడిగులు అంటే నచ్చదు అని మండిపడింది. సుడాన్ (sudan) నుంచి వారిని ముందే ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది.
సుడాన్లో ఉన్న గిరిజనులను (tribals) వారి కర్మకు వదిలేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా (surjewala) అన్నారు. ప్రహ్లాద్ జోషి, శోభ కర్లందాజే, బీజేపీ ఎంపీలు ఎక్కడ అని అడిగారు. సీఎం బొమ్మై (bommai) మిమ్మల్ని చూసి సిగ్గేస్తోందని అని ట్విట్టర్లో రాశారు.
గిరిజనులను సురక్షితంగా స్వదేశం తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం బొమ్మై, ప్రధాని మోడీని (modi) కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కోరారు. ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది అని.. కానీ ఆలస్యం చేసిందని మండిపడ్డారు. గిరిజనులను స్వదేశం తీసుకొచ్చే చర్యలు చేపడుతున్నామని బీజేపీ చెబుతోంది. మరోవైపు సుడాన్లో వరసగా మూడోరోజు కూడా హింసాత్మక ఘటన జరిగాయి.